మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ 20వ డివిజన్ ఎస్టి కాలనీ లోని నిరుపేద కుటుంబానికి చెందిన కల్లుకోట రాజేశ్వరి రాజేందర్ ఇద్దరూ కూడా వికలాంగులు పుట్టుకతో వికలాంగులైన వీరు ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకొని రామగుండం ఎస్టీ కాలనీలో నివాసం ఉంటూ చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న వీరికి ఈ మధ్యనే ఓక బాబు జన్మించాడని వీరి గురించి అంబేద్కర్ సంఘ నాయకులు సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ ను సంప్రదించి నిరుపేద దంపతుల స్థితిగతుల గురించి చెప్పగా ఫౌండేషన్ సభ్యులు SS కిరణం అధినేత జంపాల సత్యనారాయణ సహకారంతో రామగుండం ఎస్టి కాలనీ లోని కల్లుకోట రాజేశ్వరి రాజేందర్ ఇంటి దగ్గరకు వెళ్లి 25 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందజేశారు అనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వికలాంగులైన దంపతులఆర్థిక స్థితి గురించి మా దృష్టికి రాగానే ఫౌండేషన్ సభ్యులు జంపాల సత్యనారాయణ సహకారంతో వీరికి మా వంతుగా సహాయం అందించామని ఈ కార్యక్రమానికి సహకారాలు అందించి దాతృత్వాం చాటిన SS కిరణం జంపాల సత్యనారాయణ కు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మడిపెల్లి మల్లేష్ అన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధి జూల వినయ్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: