ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

జిడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్యతతో  కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్  మున్సిపల్ కుడా ఇరిగేషన్ స్మార్ట్ సిటీ శాఖల ద్వారా కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో గురువారం  పరిశీలించారు.  

అభివృద్ధి పనులలో వేగం పెంచి నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టర్  జిడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్యతో  కలిసి  మున్సిపల్, కుడా, ఇరిగేషన్, స్మార్ట్ సిటీ శాఖల ద్వారా నగరంలో (హన్మకొండ జిల్లా పరిధిలో) కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలు, పెండింగ్ లో ఉన్న పనులు ఇంకనూ టెండర్ ప్రక్రియ పూర్తి చేయాల్సిన పనుల గురించి   సంబంధిత శాఖల అధికారులతో ఆరా తీశారు.

ప్రగతి నగర్ లో కొనసాగుతున్న15 ఎంఎల్డి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను పరిశీలించారు.  బంధం చెరువు బండుపై చేపట్టబోయే 570 మీటర్ల అభివృద్ధి ప్రాంతాన్ని పరిశీలించి త్వరితంగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

 సమ్మయ్య నగర్ లో  నిర్మిస్తున్న వైకుంఠధామాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించి పనులు మొత్తం పూర్తయినందున  ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.

సర్క్యూట్ గెస్ట్ హౌజ్  సమీపంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులను  పరిశీలించారు.

సమ్మయ్య నగర్ 100 ఫీట్ల రోడ్డు వద్ద ఇరిగేషన్ శాఖచే జరుగుతున్న నాలా పనులను కలెక్టర్ పరిశీలించారు.

ప్రభుత్వ ప్రాక్టీసింగ్ స్కూల్ లో ఇటీవలే మన ఊరు మన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన  మౌలిక సదుపాయాలను,    నర్సరీ లేబర్ హుడ్ ఛాలెంజ్ లో భాగంగా నిర్మిస్తున్న సైన్స్ పార్క్ పరిశీలించారు.

హనుమకొండ నుండి శాయంపేట  జంక్షన్ వరకు ఏర్పాటు స్మార్ట్ ఆర్ వన్ రోడ్, జంక్షన్ ను సరేగమా పార్కును పద్మాక్షి గుట్ట వద్ద అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు.

భద్రకాళి బండ్ పై కుడా ఆధ్వర్యంలో మొదటి ఫేస్ లో నిర్మించిన బండ్ ను, అదేవిధంగా జి డబుల్ ఎంసీ ద్వారా ఫేస్ టు లో భద్రకాళి చేరువుపై  నుండి పోతన నగర్ వరకు 75 కోట్ల రూపాయల వ్యయంతో 2 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేస్తున్న  బండ్ అభివృద్ధి పనులను  ఇటీవల ప్రారంభించుకున్న 150 ఫీట్ల జాతీయ జెండాను బండి పై కలియ తిరుగుతూ పరిశీలించారు.  నీటిపారుదల శాఖ ద్వారా బొంది వాగు పై చేపడుతున్న పనులను పరిశీలించి అభివృద్ధి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం కుడా ఆధ్వర్యంలో 73 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న కాళోజీ కళా  క్షేత్ర పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించగా, కుడా వైస్ చైర్మన్ ప్రావీణ్య పనుల ప్రగతి గురించి కలెక్టర్ కు వివరిస్తూ కాళోజీ కళాక్షేత్ర నిర్మాణ పనుల బాధ్యతలను గత నవంబర్లో పర్యాటక శాఖ నుండి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకోవడం జరిగిందని,

 మొదటి విడతలో  23 కోట్ల రూపాయలను ఖర్చు చేసి సివిల్ వర్క్ నిర్మాణం చేయడం జరిగిందని, రెండో విడతల్లో మంజూరైన 40 కోట్ల రూపాయలతో ఇంటీరియర్ డిజైనింగ్ ఫినిషింగ్ వర్క్ చేపడుతున్న పనులు నిర్దిష్ట గడువులోగా  పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమాల్లో  బల్దియా ఎస్ఈ లు ప్రవీణ్ చంద్ర, కృష్ణారావు స్మార్ట్ సిటీ ఆనంద్ ఓలేటి, కూడా ప్రాజెక్ట్ ఆఫీసర్ అజిత్ రెడ్డి , ఈఈ లు భీం రావు, రాజయ్య, శ్రీనివాస్ రావు, రోడ్లు భవనాల శాఖ నీటి పారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: