ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కి ఉజ్వల భవిష్వత్ కోసం ఒక కొత్త పుంతలో నడిపించాలనే ఉద్దేశ్యంతో గతంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ అనే సిస్టం ఉండేది. కుడా నుండి గవర్నమెంట్ పార్టనర్ షిప్ తో వరంగల్ లో తూర్పు లో 74.50 కోట్లతో నూతన బస్టాండ్ నిర్మాణానికై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, సంబంధిత శాఖ మంత్రి, మున్సిపల్ శాఖా మంత్రి జీవో ఇవ్వడం జరిగింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో ఈ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. జీప్లస్ వన్,32 బస్ షెల్టర్స్, మిగతాదంతా మల్టిప్లెక్స్ జోన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేదిగా ఇవి ఉపకరిస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అభివృద్దికి కుడా, హుడా, ఇతర ప్రభుత్వ సంస్థల తో భాగస్వామ్యంతో పనిచేస్తే ఆదాయ వనరులు పెంచుకునేందుకు మంచి అవకాశం ఉంటుందని మంత్రిగారికి సూచన చేస్తున్నాను.

Post A Comment: