ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి అన్నారు.

సోమవారం జిల్లా పోలీసు కార్యాలయoలో పోలీస్ అధికారులతో  పెండింగ్ కేసులపై ఎస్పి సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి డిఎస్పీ,  సిఐలను, ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ, గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, ఏ ఏ అంశాలు క్రోడికరించాలి తదితర అంశాల గురించి వివరించారు.  ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని, కేసుల్లో శిక్షల శాతం పెంచాలని, ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని అన్నారు. గంజాయి, గుట్కా, పేకాట పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, సమూలంగా నిర్మూలించాలని అన్నారు. ప్రతి పోలీసు  అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. ఐపిసి, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్  బుక్కులను తరచుగా చదువుతూ ఉండాలని సూచించారు. ఆత్మహత్యల కేసులలో అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ చేసి కేసు ఫైనల్ చేయాలని సూచించారు. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా      చేధిoచాలని, కేసుల చేధనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలని ఎస్పి  పేర్కొన్నారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని. అలాగే  పాత నేరస్తులను తనిఖీ చేయాలని దొంగతనాల కేసుల్లో ప్రతిరోజు కేసుల ఛేదన గురించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని, దొంగతనాల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పి  ఆదేశించారు. అంతకుముందు ప్రజాదివాస్ కార్యక్రమంలో భాగంగా 11 పిర్యాదులు స్వీకరించిన ఎస్పి  బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పి వి. శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు రాములు, రామ్ మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ లు రాజిరెడ్డి, వాసుదేవరావు, రాజేశ్వర్ రావు, వెంకట్, కిరణ్, రంజిత్ రావు, సతీష్, సంతోష్, జిల్లా పరిధిలోని ఎస్సైలు  పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: