ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల అనుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో లీగల్ ఏయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం ను తెలంగాణ రాష్ట్ర చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పి.నవీన్ రావు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. అనంతరం వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కే.రాధాదేవి మరియు ఎం.కృష్ణమూర్తి గార్లు జిల్లాలోని 10 కోర్టుల భవనములో లీగల్ ఏయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కార్యాలయము ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు, న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శులు జే.ఉపేందర్ రావు, బి.శ్రీనివాసులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ.ఆనంద్ మోహన్, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, వరంగల్ హనుమకొండ జిల్లాల ఆర్డీవోలు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తులు హనుమకొండ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా నియమితులైన డి.శ్రీకాంత్, వరంగల్ డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా నియమితులైన ఆర్.సురేష్, అసిస్టెంట్ లీగల్ ఏయిడ్ కౌన్సిల్ గా నియమితులైన ఆర్.రజిని లను అభినందించి, "పేదవారికి, మహిళలకు, వృద్ధులకు అన్యాయం జరగకుండా చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే ఉద్దేశంతో పనిచేయాలని సూచించారు. సహాయం కొరకు వచ్చిన ప్రతివాదుల వాదనలను అర్థం చేసుకొని, న్యాయం జరిగేలా సహకరించాలని కోరారు.

Post A Comment: