ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేతుల మీదుగా  ప్రారంభం అయ్యాయి. 

ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్ ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్  జన్మదినం సందర్బంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని అజంజాహి మీల్స్ గ్రౌండ్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్బహించనున్న వేడుకలను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు , ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్  ప్రారంభించారు.

అనంతరం ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ పథకాలు, కేసీఆర్  ఉద్యమం నాటి నుండి నేటి వరకు జరిగిన పరిణామాలను ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో పాటు  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, వరంగల్ జిల్లా పరిషత్ చేర్మెన్ గండ్ర జ్యోతి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తదితరులు వీక్షించారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  మాట్లాడుతూ

ఉద్యమనేత ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించే వరకు కొట్లాడినేత, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్  జన్మదిన వేడుకలు ఇంత గొప్పగా నిర్వహించడం పట్ల నన్నపునేని నరేందర్ ని అభినందించారు

పోయిన ఏడాది కూడా నరేందర్ ఆహ్వానం మేరకు వేడుకలకు హాజరయ్యానని అన్నారు.

"ఈ తూర్పు నియోజకవర్గం లో నరేందర్ గెలుపు ఖాయమైందని,అన్ని సర్వేలలో నరేందర్ వైపే ఉన్నాయని నరేందర్ గెలుపును ఎవ్వరు ఆపలేరన్నారు"

నన్నపునేని నరేందర్ కి తన ఆశీస్సులు ఎప్పటికి ఉంటాయని అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా పరిషత్ చేర్మెన్ గండ్ర జ్యోతి,మేయర్ గుండు సుధారాణి ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ

ముఖ్యమంత్రి కేసీఆర్  జన్మదినాన్ని పురస్కరించుకుని ఇంత పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడం అలాగే ఉద్యమ నాటి నుండి నేటి వరకు కేసీఆర్  చరిత్ర చేసిన అభివృద్ధి సంక్షేమ పధకాల ఎగ్జిబిషన్ అద్భుతంగా ఏర్పాటు చేసిన నరేందర్ ని అభినందించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ

తెలంగాణా దిశ, దశను సీఎం కేసీఆర్ మార్చారన్నారు. రాదనుకున్న తెలంగాణాను సాదించారని, తెలంగాణా జాతిని ఏకతాటిపైకి తీసుకువచ్చి తెలంగాణా సాధించారన్నారు. సాధించుకున్న తెలంగాణాలో అభివృద్ది ఫలాలను ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్  అందజేస్తున్నారన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్దిలో తెలంగాణాను దేశంలోనే నంబర్ వన్ గా నిలిపారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచామని 3700కోట్లతో ఈ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తున్నామన్నారు. కేసీఆర్  లాంటి నాయకుడు దొరకడం తెలంగాణా అదృష్టమన్నారు. నేడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారి కేసీఆర్  నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి చేసేందుకు బాటలు వేద్దామన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు  ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉంటూ తగు సలహాలు సూచలు చేస్తున్నారని, గతంలో సైతం నా ఎదుగుదలకు, నా గెలుపుకు కృషి చేస్తా అన్నందుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

కేసీఆర్  మీద మాకున్న ప్రేమతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  పోరాట చరిత్ర అందరికి తెలిసేలా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసామన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: