ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న మన ఊరు -మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు బాగు పడుతున్నాయని, ఈ బాగులో ప్రజలు, స్థానికులు భాగస్వాములు కావాలని బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం 7289 కోట్ల రూపాయలతో చేపట్టిన
మన ఊరు - మన బడి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా బుధవారం పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన అధునాతన వసతులను మంత్రి నేడు ప్రారంభించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ
మన ఊరు మన బడి పథకాన్ని మహబూబాబాద్ జిల్లాలో మాటేడు నుంచి ప్రారంభం చేశాం.
పాఠశాలను బాగు చేయడంలో కృషి చేసిన వారందరికీ అభినందనలు.
విద్యార్థులకు, గ్రామస్తులకు శుభాకాంక్షలు. కేసిఆర్ సీఎం కాక ముందు ఇక్కడికి వచ్చినప్పుడు నీళ్ళ కొట్లాట ఉండేది.ఈ ప్రభుత్వం చేసే పథకాలు ఎవరూ చేయలేదు.
గతంలో వర్షాకాలంలో కూడా నాట్లు వేయకపోయేది. కానీ ఇపుడు యాసంగిలో కూడా నాట్లు వేస్తున్నాం.
సీఎం కేసీఆర్ పుష్కలంగా నీరు ఇస్తున్నారు. ఎకరానికి ఏటా 10వేల రూపాయల రైతు బంధు ఇస్తున్న మహానుభావులు సీఎం కేసిఆర్. ఆయన్ని మనం కాపాడుకోవాలి.
కానీ ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ బడుల్లోనే మంచి బోధన, వసతులు ఉన్నాయి.
డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశాం.ప్రైవేట్ స్కూల్స్ కంటే ఈ స్కూల్ ను బాగు చేయడం నా లక్ష్యం.ఆ రోజు లక్ష్మారెడ్డి ఈ పాఠశాల బాగు కోసం పని చేశారు. ఆయన స్పూర్తితో మనం పని చేయాలి.
బడిలో సాయంత్రం టూషన్ చెప్పాలి. ఇందుకు గ్రామస్తులు కొంత సాయం చేయాలి. బాధ్యత తీసుకోవాలి.
రైతులకు నీళ్ళు, కరెంట్, పెట్టుబడి ఇచ్చాం. ప్రతి గింజ కొంటున్నాం. రైతు బాగు పడుతున్నాడు.
పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం.
మహబూబాబాద్ లో 500 కోట్ల రూపాయలతో హాస్పిటల్, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం.
కానీ మనం చేసినవి మరిచి, కొంతమంది కొత్తవి అడుగుతున్నాం.
కొత్తవి అవసరమే కానీ ఒక్కసారే అన్ని కావు. దశల వారీగా అవుతాయి.
కోటి రూపాయలతో ఈ మాటేడు గ్రామంలో రోడ్లు వేశాం. ఇంకా ఈ గ్రామాన్ని తీర్చి దిద్దుతాను. ఇక్కడ ఆలయాన్ని అభివృద్ది చేయాలి. కానీ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. కేంద్రం నుంచి అనుమతులు రావాలి. ఇక్కడి ఆలయానికి కాకతీయులు కట్టిన చరిత్ర ఉంది. దీనికి పూర్వ వైభవం తీసుకు వద్దాము.
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలు బాగు చేస్తున్నారు.
రెసిడెన్షియల్ స్కూల్లో ఒక్కో విద్యార్థిపై లక్షా 25వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మన దగ్గర ఉన్నన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడా లేవు. ఇన్ని మంచి పనులు చేస్తున్న
సీఎం కేసిఆర్ ని మనం కాపాడుకోవాలి.
అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ మన ఊరు - మన బడి మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వ పాఠశాలలు బాగు పడుతున్నాయి.
జిల్లాలో 316 పాఠశాలలు మంజూరు అయ్యాయి. 44 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ స్కూల్లో 3 డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశాం.
ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మంచిగా బోధించి వారిని వృద్ధిలోకి తీసుకురావాలి.
ప్రారంభోత్సవం అనంతరం పాఠశాల ఆధునీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఆటస్థలంలో మంత్రి వాలీబాల్ ఆట ఆడారు.
కార్యక్రమం అనంతరం విద్యార్థినులతో కలిసి స్టేజ్ వద్దే మంత్రి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో రమేష్, జిల్లా విద్యాధికారి రామారావు, జీసీసి మాజీ చైర్మన్ గాంధీ నాయక్, జెడ్పీటీసీ శ్రీనివాస్, ఎంపీపీ తూర్పాటి చిన అంజయ్య, ఏఎంసి చైర్మన్ శ్రీమతి పసుమర్తి శాంత, స్థానిక సర్పంచ్ శ్రీమతి శోభ, ప్రధాన ఉపాధ్యాయులు వేణు మాధవ రెడ్డి, స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ సాయిలు తదితరులున్నారు.

Post A Comment: