ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచనల మేరకు డిఆర్ ఓ వాసుచంద్ర అధ్యక్షతన కాజీపేట ఏసిపి శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ కిరణ్ కుమార్ మరియు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో డీఆర్ ఓ వాసుచంద్ర మాట్లాడుతూ ఈ నెల 18 వ తేదీన జరుపుకొనే మహాశివరాత్రి ఉత్సవాలు శ్రీ శ్రీ శ్రీ రుద్రేశ్వర స్వామి వారి వెయ్యి స్తంభాల దేవాలయంలో ఈనెల 17 నుండి 21 వరకు మరియు మెట్టు గుట్టలోని శ్రీ స్వయంభూ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో తేది.16 నుండి 24 వరకు ఘనంగా ఉత్సవాలు జరుపుకొనుటకుగాను, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించుటకు వివిధ శాఖల అధికారులను సమన్వయంతో కలిసి పనిచేసి మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సునీత, పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్, ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, వేయి స్తంభాల గుడి ఈవో శేషగిరి, మెట్టుగుట్ట ఈవో శేషు భారతి, డిఎంఅండ్ హెచ్ ఓ ఆఫీస్ నుండి డిఎస్ ఓ డాక్టర్ వాణిశ్రీ, ఆర్ అండ్ బి ఈఈ రాజం, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ భార్గవ్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ విజయభారతి, ఎన్పీడీసీఎల్ ఈడి సాంబ రెడ్డి, జిడబ్ల్యు ఎంసి ఈఈ శ్రీనివాసరావు, హనుమకొండ తహసిల్దార్ రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: