ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సమస్యలను పరిష్కరించాలని వచ్చే బాధితుల ఫిర్యాదులపై అలసత్వం ఉండకూడదని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ జె. సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివాస్ కార్యక్రమంలో 16 మంది బాధితుల నుంచి ఎస్పీ సురేందర్ రెడ్డి పిర్యాదులు స్వీకరించి, ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బాధితుల సమస్యలకు సానుకూలంగా స్పందించి, ప్రతి కేసు విషయాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఇవాళ్టి ప్రజాదివాస్ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, ఆర్థిక నేరాలు, ఆస్తితగాదాలు, భూ పంచాయతీలు, మరియు ఇతరత్రా ఫిర్యాదులు రాగ, వాటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా సమస్యలను పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పి ఆదేశించారు.

Post A Comment: