మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అధైర్య పడకండి మీకు అండగా నేనున్నా అంటూ తబితా పిల్లల సంరక్షణ ఆశ్రమంలో పిల్లలకు ధైర్యాన్ని ఇచ్చిన రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఈ సందర్భంగా రామగుండంలోని తబితా పిల్లల సంరక్షణ ఆశ్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక జన్మదిన వేడుకల్లో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామూహిక జన్మదిన వేడుకలు పురస్కరించుకొని కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పిల్లలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీకు ఏ అవసరం వచ్చిన నేరుగా మమ్మల్ని సంప్రదించండి మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి బాధ్యత మాదే అని వారందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. వారి వెంట బిజెపి సీనియర్ నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ మరియు రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు కోదాటి ప్రవీణ్,బిజెపి రామగుండం మండల జనరల్ సెక్రెటరీ సంపంగి శ్రీను, బిజెపి మహిళ మోర్చా అధ్యక్షురాలు కుసుమ,అనురాగ్, ఓదెల మొగిలి,దాసరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: