మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పాలకుర్తి మండలం (మంథని నియోజకవర్గం) కన్నాల గ్రామం లో పెంచిన కరెంటు బిల్లులను తగ్గించాలని, ACD ఛార్జిలను రద్దు చేయాలనీ కన్నాల సబ్ స్టేషన్ ముట్టడి కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ పాల్గొని అధికారులకు వినతిపత్రం అందించారు...అనంతరం సునీల్ మాట్లాడుతు.. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి, అరాచకాలు మరియు ప్రజావ్యతిరేక విధానాలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు, నిత్య కరెంటు ఛార్జ్ లను పెంచుతూ ప్రజలను గోస పెడుతున్నారు, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్ర నేడు అప్పుల కుప్పగా మార్చాడు వెంటనే పెంచిన ఛార్జ్ లను తగ్గించి, ACD ఛార్జ్ లను రద్దు చేయకపోతే బీజేపీ పార్టీ పక్షాన ఈ నిరసనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు...

Post A Comment: