మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రెటరీ)గా శాంతికుమారి నియమితులయ్యారు. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె.. ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో వైద్య, ఆరోగ్యశాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.
సోమేశ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిన్న సమర్థించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే.. సోమేశ్‌కుమార్ తెలంగాణ నుంచి రిలీవ్ కావాలంటూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త సీఎస్ నియామకం అనివార్యం కాగా.. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసి శాంతికుమారి పేరును ఖరారు చేసింది. సీఎస్‌గా శాంతికుమారి 2025 వరకు పదవీలో కొనసాగనున్నారు.

Post A Comment: