మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్



మంథని నియోజక వర్గంలో క్రీడల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం అందించడానికి ఎల్లవేళలా మేము సిద్ధంగా ఉన్నామని మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు.మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన, మంథని నియోజకవర్గస్థాయి  శ్రీపాద క్రికెట్ టోర్నమెంట్  బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని

ఈ సందర్భంగా మాట్లాడుతూ,క్రికెట్ క్రీడ పట్ల యువకుల్లో ఉన్న ఉత్సాహం పట్టుదల పెంపొందించడంలో భాగంగా ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ ప్రాంతం నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ కామెంటేటర్లుగా పేరు సంపాదించిన మహావాది సుధీర్ విజయ్ సోదరులను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన క్రీడాకారులకు సూచించారు.తన ఎమ్మెల్యే నిధులనుండి 10 లక్షల రూపాయలు వాకింగ్ ట్రాక్ కొరకు కేటాయించడం జరిగిందని,ఆ నిధులతో మార్చిలోగా పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రాబోయే కొద్ది రోజుల్లో క్రికెట్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు,దానికి సంబంధించిన నెట్లు క్రీడా సామాగ్రిని సమకూర్చినట్లు ఆయన వెల్లడించారు.ఈ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన అటాక్ విలన్ టీం కెప్టెన్ గాజుల నిఖిల్ కు మేమేంటోతో పాటు లక్ష రూపాయల నగదు శ్రీధర్ బాబు అందజేశారు. అలాగే రన్నరపు వారికి 50 వేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇనుముల సతీష్,సెగ్గం రాజేష్,శశి భూషణ్ కాచే, కౌన్సిలర్ పెండ్రు రమాదేవి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: