ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ

 

హన్మకొండ ;

దేశానికి తొలి తెలుగు ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు 83వ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ బస్ స్టాండ్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు హుస్నాబాద్ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్,జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్,కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై చిందరవందరగా ఉన్న సమయంలో సరళీకృత సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ గతిని మార్చిన గొప్ప దార్శనికుడు పీవీ నరసింహారావు అని ఆయన కొనియాడారు. నేడు దేశానికి ఆయన ఆర్ధిక సంస్కరణలు నిర్ధేశనం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన సేవలను గుర్తించలేని స్థితిలో ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన సేవలను స్మరిస్తూ ఆయన జన్మస్థలమైన వంగరలో ఆయన చరిత్రను తెలిపేలా మ్యూజియంను నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు.

ఆయన విశిష్ట సేవలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు మీద వెటర్నరి యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, వామన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: