మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహాదేవపూర్ లో నేడు రెడ్ రిబ్బన్ క్లబ్ కన్వీనర్ డాక్టర్ పోరిక రాజు ఆధ్వర్యంలో,మహాదేవపూర్ ప్రజాప్రతినిధులు ఎంపీపీ రాణి భాయ్,జడ్పీటీసీ అరుణ,స్థానిక సర్పంచ్ శ్రీపతి బాబు తో కలిసి అంతర్జాతీయ ఎయిడ్స్ నిర్ములన దినోత్సవం జరిగింది.కళాశాల నుండి విద్యార్థులు మహాదేవపూర్ సెంటర్ వరకు ప్లకార్డ్స్ పట్టుకొని ర్యాలీగా వెళ్లి నినాదాలు చేస్తూ మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేశారు.ఎయిడ్స్ వ్యాధి కి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం అని,దీన్ని పారద్రోలే విధంగా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపల్ జి.రమేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రజిత, రమేష్,పర్శరాములు, విజయ కుమార్,డాక్టర్. శ్రీనివాస్,డాక్టర్.రాజన్న, మహేష్,అశ్రా,రవీందర్, వేణుగోపాల్,భాగ్యలక్ష్మీ పాల్గొన్నారు.
Post A Comment: