ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. గణపురం మండలం బుర్రకాయల గూడెం శివారులో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన దారుడు నడికూడ మండలం రాపర్తి గ్రామానికి చెందిన బైరి విజేందర్ (38) అక్కడికక్కడే మృతి చెందాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని శాతరాజు పల్లిలోని బంధువు మృతి చెందగా అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా బుర్రకాయల గూడెం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో విజేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.గణపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Post A Comment: