మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం సీనియర్ అర్చకులు శ్రీరాంభట్ల ప్రశాంత్ శర్మకు పదోన్నతి లభించినట్లు పలువురి ద్వారా సమాచారం. ఈ దేవాలయంలో సుమారు 30 సంవత్సరముల నుండి అనుబంధ ఆలయాల అర్చకులుగా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ ముఖ్య అర్చకుల నుండి,ఉప ప్రధాన అర్చకులుగా పదోన్నతి లభించినట్లు తెలిసింది.ఇట్టి విషయంపై ఆలయ ఈవో మహేష్ ను వివరణ కోరగా త్వరలో ఆదేశాలు రానున్నట్లు తెలిపారు.
Post A Comment: