మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
(02.12.2022) ఎన్ టి పి సి అన్నపూర్ణ కాలనీలోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు పెద్దపల్లి జిల్లా మూడవ మహాసభల సందర్భంగా జరిగే ర్యాలీ బహిరంగ సభ మల్టీకలర్ పోస్టర్ను సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు మరియు సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ తుమ్మల రాజారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో కామ్రేడ్ రాజారెడ్డి ప్రసంగిస్తూ 2022 డిసెంబర్ 10, 11 తేదీలలో జరిగే సిఐటియు పెద్దపల్లి జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయడం కోసం పదవ తారీఖు నాడు భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఎన్ టి పి సి గేట్ నెంబర్ 2 నుండి ఎఫ్ సి ఐ కార్నర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. అనంతరం టీవీ గార్డెన్ లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. అఖిల భారత సిఐటియు ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎం సాయిబాబా సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు కామ్రేడ్ కే భూపాల్ మరియు కామ్రేడ్ పి మధు మరియు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ తుమ్మల రాజ రెడ్డి అతిథులుగా హాజరై బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కావున సిఐటియు నిర్వహించే ర్యాలీ మరియు బహిరంగ సభను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి కామ్రేడ్ నాంసాని శంకర్ అధ్యక్షత వహించారు ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు బిక్షపతి ప్రధాన కార్యదర్శి ఎం రామాచారి కోశాధికారి గిట్ల లక్ష్మారెడ్డి, యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షులు కామ్రేడ్ ఈ భూమయ్య నాయకులు ఎండి ఎండి యాకుబ్, కాదాసి మల్లేష్, టి రవీందర్, సునీత కృష్ణారెడ్డి జి బిక్షపతి కుమార్ జగన్ రాణి రాజేశ్వరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: