మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు, మహాదేవపూర్ నగర శాఖ ఆధ్వర్యంలో,ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 2200 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని,ఖాళీగా ఉన్న టీచింగ్,నాట్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని,ఖాళీగా ఉన్న జేఎల్ & డిఎల్ పోస్టులను భర్తీ చేయాలి,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసారు. లేనియెడల రాబోయే రోజుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా,హాస్టల్ పేట సాయి, నగర ఉపాధ్యక్షుడు జోడు వెంకటేష్ ,సుశాంత్,శేఖర్, అభిలాష్ ,జగదీష్ నగర మహిళా కన్వీనర్ హారిక అనూష ,సాయి లక్ష్మి కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: