పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:మంథని:నవంబర్:8:నా శ్వాస ద్యాస బీదవాళ్ల సంక్షేమం కోసమే,మంథని ఆర్టీసీ బస్టాండ్ లో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చంటి పిల్లలకు తల్లి పాలిచ్చే గదిని మంగళవారం జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్,మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ,జడ్పీటీసీ తగరం సుమలత లతో కలిసి ప్రారంభించారు,ఈ సందర్బంగా జడ్పీ పుట్ట మధూకర్ మాట్లాడారు,ప్రతి పేదవాడికి సేవ చేయాలన్న ఆలోచనతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.అయితే తాము చేసే ప్రతి సేవ కార్యక్రమాలను కాపీ కొడుతున్న కాంగ్రెస్ పేదవాడి కన్నీళ్లను మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.ఆర్టీసీ బస్టాండ్లలో చంటి పిల్లలకు పాలిచ్చేందుకు తల్లులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో తన కుమారుడు పుట్ట శ్రీహర్ష్ జగిత్యాల బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఫీడింగ్ రూంను చూసి మన ప్రాంతంలో కూడా అక్కా చెల్లెలు అగౌరపడకుండా గౌరవంతో పిల్లల ఆకలి తీర్చేలా వసతి కల్పించాలని తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్లో బేబీ ఫీడింగ్ రూం ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులు సహహారం అందించారని ఆయన తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని,క్రీస్తు శకం,క్రీస్తు పూర్వం..ను చూసినట్లుగానే తాను అదికారంలో రాకముందు,అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమాలపై ప్రజలు బేరీజు వేసుకుని చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.తాను ఒక బీద కుటుంబంలో పుట్టినప్పటికి పేదవాడి ఆకలి తెలిసిన వాడిగా,ఎలాంటి రాజకీయ నేపద్యం లేని తాను సేవలు అందిస్తున్నానని,ఉన్నత చదువులు చదువుకుని అనేక ఏండ్లు ఈ ప్రాంతంలో పరిపాలన చేస్తూ అధికారం చెలాయిస్తున్న కుటుంబానికి పాఠాలు నేర్పిన వ్యక్తిగా నిలబడ్డానని ఆయన గుర్తు చేశారు.40ఏండ్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఒకే కుటుంబం ఏనాడు పేదవాడి కష్టాలు,కన్నీళ్లు పట్టించుకోలేదని,పేద ప్రజల ఓట్లతో పదవులు చేపట్టి మన సంక్షేమాన్ని విస్మరించారని ఆయన వివరించారు.ఆనాడు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓటు విలువ చెప్పారని,ఆ విలువ మనకు తెలియక పోవడం మూలంగానే ఇన్నాళ్లు అనేక ఇబ్బందులు పడ్డామని,ఇకనైనా ఓటు విలువ తెలుసుకోవాల్సిన బాద్యత అందరిపై ఉందన్నారు.మంథని ఆర్టీసీ బస్టాండ్ దుస్థితిపై ఏనాడు పట్టించుకోలేదని,ఆర్టీసీ బస్టాండ్కు తన కుటుంబ సభ్యులు రాకపోయినా తన అక్కాచెల్లెలు వస్తారని,అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలోచన చేశామని ఆయన తెలిపారు.ఎక్కడా లేని విధంగా మంథని ఆర్టీసీ బస్టాండ్ అభివృద్దికి ఎమ్మెల్యే నిదులు కేటాయించిన ఘనత తనకే దక్కుతుందన్నారు.ఆర్టీసీ బస్టాండ్కు ఎక్కువగా పేదవాళ్లు మాత్రమే వస్తుంటారని,అలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగవద్దని ఆలోచన చేశామని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రాంతంలో సంబంధంలేదని,ఈ మట్టిలో పుట్టని నాయకులకు అధికారం అప్పగిస్తే ఎలాంటి పాలన ఉంటుందో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.బస్టాండ్లలో చంటి బిడ్డల ఆకలి తీర్చేందుకు అక్కా చెల్లెలు ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో ఈ రూంను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ రూంను ప్రతి ఒక తల్లి సద్వనియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ,ఎంపీటీసీలు,మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు...


Post A Comment: