పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:నవంబర్:8:ఆధునిక సదుపాయాలతో జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి చేసామని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.మంగళవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతారెడ్డి లతో కలిసి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సందర్శించి ప్రజల సౌకర్యార్థం 25 ఫ్యాన్లను జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మాట్లాడారు,జిల్లాలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మాతా,శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం ద్వారా అనేక మంది లబ్ధి చేకూరుతుందని,ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజల కోసం ల్యాబ్ సౌకర్యం కల్పించి వైద్య పరీక్షలు సైతం ఉచితంగా నిర్వహిస్తున్నామని,గత నెలలో జిల్లా ప్రథాన ఆసుపత్రిలో దాదాపు 23 వేల వైద్య పరీక్షలు నిర్వహించామని చైర్మన్ తెలిపారు.ల్యాబ్ పరీక్షల నిర్వహణ కోసం ప్రతి మాసం రూ1.5 లక్షలు ఖర్చు అవుతాయని,ఇకపై ప్రతి నెల సొంతంగా ప్రభుత్వ ఆసుపత్రికి 10 వేల రూపాయలు వైద్య పరీక్షల నిర్వహణకు విరాళం అందిస్తానని,అదే విధంగా సంపన్నులు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించాలని జడ్పీ చైర్మన్ కోరారు,ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్,జడ్పీటీసీలు బండారి రాంమూర్తి,తగరం సుమలత,జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్,సంబంధించిన అధికారులు,తదితరులు పాల్గొన్నారు


Post A Comment: