ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ

 

హన్మకొండ ;

 పాలకుర్తి నియోజకవర్గం లోని  జనగామ జిల్లా

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూనే, ఆఖరు గింజను సైతం కొనే బాధ్యతను సీఎం కెసిఆర్ తీసుకున్నారని, కేంద్ర ప్రభుత్వం కాదన్నా, చేతులెత్తేసి మోసం చేసినా, రైతు పక్షపాతిగా సిఎం కెసిఆర్ రైతుల సంక్షేమం కోసం నిలబడ్డారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివ్రుద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి ప్రాథమిక రైతు వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం వల్మీడి, అయ్యంగారిపల్లె గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కి రైతులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు.  రాష్ట్ర రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శమని అన్నారు. ఆడబిడ్డకు మేనమామ గా కళ్యాణాలక్ష్మి పథకం ఇస్తున్నారన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అయిదు వందల పెన్షన్ కూడా రావడం లేదు మన రాష్ట్రంలో 2వేలు, 3 వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి నీళ్లు అందించిన మహాత్ముడు సీఎం కేసీఆర్. సాగు నీరు, మంచినీరు, 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు పంటలు బాగా పండి, దిగుబడి పెరగడానికి కారణం సీఎం కెసిఆర్ అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ప్రతి ఏటా 3 వేల కోట్లు నష్టం వచ్చినా భరిస్తూ, సీఎం కెసిఆర్  కొనుగోలు చేస్తున్నారని వివరించారు. 

దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వం కూడా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదు పక్క రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయి. కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం కుట్ర చేసింది. నా బొంది లో ప్రాణం ఉండగా మీటర్లు పెట్టనివ్వనని తేల్చి చెప్పిన మహానుభావుడు సీఎం కెసిఆర్. ఒక్కో మీటర్ కు వేలాది రూపాయల బిల్లు వస్తున్నది రైతులు లాభ పడాలన్నదే సీఎం కెసిఆర్ లక్ష్యం. రైతులు, బాగా డిమాండ్ ఉండే ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి. ఎకరాకు లక్షా 40 వేల వరకు ఆదాయం వస్తున్నది. నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా ఆయిల్ పామ్ నర్సరీ, నూనె తీసే ఫ్యాక్టరీ పెట్టిస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చూడాలి సమస్యలు వస్తే వెంటనే వాటిని పరిష్కరించాలి టోకెన్లు ఇవ్వండి. పద్ధతి ప్రకారం, ప్రతి గింజ కొనాలి ఆఖరి గింజ వరకు కొంటాం అని మంత్రులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి కమిటీ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: