ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

సర్వాంగ సుందరంగా పాలకుర్తి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నాను. రూ. 38.50 కోట్లతో వల్మీడి, పాలకుర్తి, బమ్మెర ఆధ్యాత్మిక కారిడార్ నిర్మాణపు పనులు వేగంగా పూర్తి కావస్తున్నాయి. అందులో వల్మీడి రామాలయ అభివృద్ధికి రూ.6 కోట్ల ఖర్చు చేస్తున్నాం. మరిన్ని నిధులు తేవడానికి సిద్ధంగా ఉన్నాను. పాలకుర్తి నుంచి అన్ని ప్రాంతాలకు డబుల్ రోడ్లు వేస్తున్నాను. వల్మీడి, పాలకుర్తి, బమ్మెర దేవాలయాల్లో అన్ని హంగులతో కాటేజీలు, కళ్యాణ మండపాలు, మెట్ల దారులు నిర్మించబోతున్నం. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  అన్నారు. వల్మీడి దేవాలయాన్ని మంత్రి మంగళవారం సందర్శించారు.  సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు.  ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ లకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, వల్మీడి, పాలకుర్తి, బమ్మెర దేవాలయాల అభివృద్ధి కి సిఎం కెసిఆర్ ఎనలేని సహకారం అందిస్తున్నారన్నారు. సీఎం కెసీఆర్ స్వయంగా సందర్శించి, ఈ ప్రాంతంపై మమకారంతో అభివృద్ధికి నడుం బిగించారు. పాలకుర్తి దేవాలయానికి రూ.16.50 కోట్లు, వల్మీడి కి రూ. 6 కోట్లు, బమ్మెర కు 16 కోట్లు కేటాయించి, అభివృద్ధి పరుస్తున్నట్లుగా మంత్రి చెప్పారు. వల్మీడి, పాలకుర్తి, బమ్మెర దేవాలయాల్లో అన్ని హంగులతో కాటేజీలు, కళ్యాణ మండపాలు, మెట్ల దారులు, గాలి గోపురాలు, మంచినీటి వసతి, స్నానఘట్టాలు, క్యూ లైన్ల ఏర్పాటు వంటి సకల సదుపాయాలను కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: