చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని బస్ స్టేషన్ దగ్గర గల హ్యాండ్లూమ్ మార్కెట్లో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములలో ఎన్నికల సమయంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వాటికి సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోవాలని 11వ వార్డు కౌన్సిలర్ బిజెపి ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు కోరడం జరిగింది. బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ ఆఫీసులో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ప్రజలకు
సంబంధించిన పలు విషయాలను ప్రశ్నించడం జరిగిందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన కాంట్రాక్టు ముగిసిన సందర్భంగా కొత్త కాంట్రాక్టర్ కి అవకాశం కల్పించే
విధంగా టెండర్ ద్వారా ఆహ్వానించాలని పాత కాంట్రాక్టర్ గడువు పొడగింపు ప్రతిపాదనను వ్యతిరేకించడం జరిగిందని తెలిపారు.
Post A Comment: