చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
చేపట్టిన బస్తీ దవఖాన నిర్మాణాన్ని 10వ వార్డులోని పాత వాటర్ ట్యాంక్ స్థలంలో చేపట్టాలని 10వ వార్డు కౌన్సిలర్ బొడియే అరుణ బాలకృష్ణ అన్నారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో చౌటుప్పల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ వార్డులో ఆసుపత్రి నిర్మించినట్లయితే దాదాపుగా
నాలుగు వార్డుల ప్రజలకు వైద్య అవసరాల కోసం ఉపయోగకరంగా ఉంటుందని, ఈప్రాంత ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే జాతీయ రహదారి దాటి సుమారు రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించడం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కాబట్టి ప్రజల అవసరాలను, ఇబ్బందులను గుర్తించి పదో వార్డు పరిధిలోని సర్వేనెంబర్1లో పాత వాటర్ ట్యాంకు స్థలంలో నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్
చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, దండ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: