మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.బుధవారం రోజున స్థానిక క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యుజెఎఫ్) రాష్ట్ర ద్వితీయ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కార్పొరేటర్ పెంట రాజేష్,కార్పోరేటర్ పులెందర్, టిడబ్ల్యుజెఎఫ్ జిల్లా అధ్యక్షులు పోగుల విజయకుమార్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బిక్షపతి,ఫణి సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షులు బోయిన వినోద్ ,మారం తిరుపతిరెడ్డి, పూసాల రవి, జంగపల్లి సాగర్, దేవేందర్, యూసఫ్ లతోపాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
Post A Comment: