ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నిత్యం విధులు నిర్వర్తిస్తూ అవిశ్రాంతంగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ గార్డ్ (స్పెషల్ పార్టీ) పోలీస్ సిబ్బందిలో ఉత్సాహం నింపడంలో భాగంగా స్నేహపూర్వక క్రికెట్ పోటీలను నేటి నుంచి ఈ నెల19వ వరకు నిర్వహిస్తున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో పోలీసు క్రీడలను ఎస్పి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పి పోలీసు క్రీడాకారులను పరిచయం చేసుకొని, కాసేపు వారితో క్రికెట్ ఆడారు. అనంతరం ఎస్పీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, నిత్యం విధులు నిర్వర్తించే సమయంలో పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, రోజువారి ఒత్తిడులను అధిగమించేందుకు క్రీడలు దోహదపడతాయని అన్నారు. ఇలాంటి పోటీల్లో పోలీసులు చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని వెల్లడించారు. పోలీసు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఎస్పి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, సిఐ రాజిరెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సంతోష్, సతీష్ , ఆర్ఎస్ఐ ఆజహార్, సీసీ ఫసియుద్దిన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: