ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

 అవినీతి నిర్మూలనతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని  సీపీ తరుణ్ జోషి దేశాభివృద్ధి సాధ్యమవుతుందని  సీపీ తరుణ్ జోషి అన్నారు.

ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు యూనియన్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శనివారం  హనుమకొండ రిజినల్ ఆఫీస్ లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగుల చే  ప్రతిజ్ఞ చేయించారు.

ఈ  సందర్బంగా సీపీ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశం కోసం అవినీతిరహిత భారతదేశం' అంశంపై విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ 2022 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతదేశ అభివృద్ధికి ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత ఎంతైనా ఉందన్నారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా నాణ్యత ప్రమాణాలతో చేపట్టే పనులతో దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి పనుల్లో  లోపాలు జరగకుండా ఉండేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఉద్యోగుల్లో అవగాహన తీసుకువస్తున్నామన్నారు.

 బాధ్యతగా విధులు నిర్వహించినప్పుడు అవినీతి రహిత దేశాన్ని చూడగల మన్నారు. వనరులను సక్రమంగా వినియోగించుకోవడం బా ధ్యత అన్నారు. సం పూర్ణ సమగ్రతను కాపాడుకోవడం, అన్ని సమయాల్లో విధికి అంకితం చేయ డం, ప్రభుత్వ ఉద్యోగికి అనాలోచితంగా చేయకూడదన్నారు. చిన్నప్పటి నుంచే  అవినీతి వాళ్ళ జరుగుతున్న అనార్ద లను  విద్యార్థులకు వివరించాలని  అన్నారు.ఉద్యోగులందరూ సమిష్టి కృషితో అవినీతి నిర్మూలనకు కృషి చేయాలని, ప్రతి ఉద్యోగీ అంకితభావం, అప్రమత్తత, నిజాయితీతో అన్నీ వేళలా అత్యంత జాగురుతతో అవినీతిపై పొరాడి సమాజాభివృద్ధి తద్వారా దేశాభివద్ధికి దోహదపడే విధంగా నడుచుకోవాలని తెలిపారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా సాంకేతికను ఉపయోగించి పౌరులకు సేవలు అందించేందుకు వివిధ రకాల ఆన్‌లైన్‌ వేదికల ద్వారా అవినీతి నిరోధము కోసం అనేక పటిష్టమైన చర్యలు తీసుకుంటోంన్నారు. మన  దేశం  సంస్కృతి, సంప్రదాయలకు  నెలవు  అని అన్నారు.

సీనియర్ సివిల్ జడ్జి ఉపేందర్ రావు మాట్లాడుతూ 

ప్రజలకు, ప్రభుత్వానికి అధికారులంతా జవాబు దారితనంగా, పారదర్శకంగా ఉంటూ వారి సంక్షేమానికి పాటుపడవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని ఆయన తెలియజేశారు. మన దేశం మన ప్రగతి, మన ప్రజలు, అనే విధంగా ప్రతి ఒక్క అధికారి భావించి పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రికవరీ కేసులకు బ్యాంకు అధికారులు తప్పనిసరిగా ఏకనాల్ డ్జిమెంట్ తీసుకోవాలని అన్నారు.రీజినల్  హెడ్ సత్యం పాలగుల  మాట్లాడుతూ యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా దేశంలో  ఐదవ  అతి పెద్ద బ్యాంకు అని అన్నారు. 

ఉద్యోగులందరూ సమిష్టి కృషితో అవినీతి నిర్మూలనకు కృషి చేయాలని, ప్రతి ఉద్యోగీ అంకితభావం, అప్రమత్తత, నిజాయితీతో అన్నీ వేళలా అత్యంత జాగురుతతో అవినీతిపై పొరాడి సమాజాభివృద్ధి తద్వారా దేశాభివద్ధికి దోహదపడే విధంగా నడుచుకోవాలని తెలిపారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా సాంకేతికను ఉపయోగించి పౌరులకు సేవలు అందించేందుకు వివిధ రకాల ఆన్‌లైన్‌ వేదికల ద్వారా అవినీతి నిరోధము కోసం అనేక పటిష్టమైన చర్యలు తీసుకుంటోంన్నారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని పేదలందరికి అందాలని పేర్కొన్నారు. అవినీతి రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని సూచించారు.

అనంతరం హనుమకొండ చౌరస్తా నుండి పబ్లిక్ గార్డెన్ వరకు  ఉద్యోగులతో వాక్ థాన్ ర్యాలీ ని సీపీ జెండా ఊపి ప్రారంభించారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: