ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ

 

హన్మకొండ ;

హనుమకొండ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో వంశీ రెడ్డి ఫౌండేషన్  ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా

 కు ముఖ్య అతిథిగా హాజరై, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి  రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ 

వంశీ రెడ్డి ఫౌండేషన్ ద్వారా వాగ్దేవి కళాశాలలో ఉమ్మడి వరంగల్ జిల్లా లోని అర్హత గల పేద విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నా మన్నారు. ఇందులో  మొత్తం 18 కంపెనీలు పాల్గొంటున్నాయని,

ఈ కంపెనీల ద్వారా సుమారు 359 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారన్నారు. ఫార్మా, ఐటి, ఇండస్ట్రియల్, ఫైనాన్స్ ఇలా అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. కంపెనీలలో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లో శిక్షణ ఇస్తారు. సుమారు 18 వేల నుండి 35 వేల వరకు మంచి జీతభత్యాలు ఉంటాయి.

ఈ జాబ్ మేళాను రాష్ట్రంలో వివిధ ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా వంశీ రెడ్డి ఫౌండేషన్ స్థాపకులు అయిన మురళీధర్ రెడ్డి  శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్  ఆద్వర్యంలో మరియు వాగ్దేవి కళాశాల యాజమాన్యం సహకారంతో నిర్వహించడం ఎంతో అభినందనీయం అన్నారు. 

కంచెర్లకుంట వంశీ రెడ్డి  ఆత్మకూరు వారి స్వస్థలం తరువాత వారు అమెరికా కు వెళ్ళారు అక్కడ సాఫ్ట్ వేర్ కంపెనీ స్థాపించారు. అక్కడ తెలుగు అసోసియేషన్ అఫ్ అకాడమి కి అధ్యక్షుని గా ఉంటూ తెలుగు ప్రజలకి సేవలు అందిస్తున్నారు.

తన పుట్టిన జిల్లా నుండి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.

క్వాడ్రెంట్  సాఫ్ట్ వేర్ కంపెనీ స్థాపించి యు.ఎస్. కెనడా, ఇండియా లాంటి పలు దేశాలల్లో విస్తరించినారు.

వంశీ రెడ్డి ఫౌండేషన్ గ్రామీణ ప్రాంతములోని పేద విద్యార్థులకు జీవనోపాధి కల్పించడం, వంశీ రెడ్డి ఫౌండేషన్ గ్రామీణ ప్రాంతములో విద్య, వైద్య, ఉపాధి, మహిళా సాధికారత రంగాలలో సేవలు అందించడానికి కృషి చేస్తున్నారు.

ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో బి.టెక్, యం.టెక్, యం.బి.ఎ, యం.సి.ఎ మరియు డిగ్రీ అర్హతతో యువత పాల్గొని ఉపాధి అవకాశాలు పొందేందుకు చక్కని అవకాశం. నిరుద్యోగ యువతీ యువకులకు స్ధిరమైన జీవనోపాధి కల్పించుటకు ప్రభుత్వము దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన పధకము ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నాము.

నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ రంగాలలో ఎన్నో రకాల ఉపాధి అవకాశములు విస్తృతంగా పెరుగుచున్నాయి. అయితే ఈ ఉపాధి అవకాశములను నిరుద్యోగ యువత అందుకోవడానికి కావలసిన నైపుణ్యాన్ని శిక్షణల ద్వారా అందించి తద్వారా వారు ఉద్యోగము సంపాదించుకునేలా చేయాలి.

సియం కేసిఆర్‌, ఐటి, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటిఆర్‌ల కృషితో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు పెరిగాయి.

ఇప్పటికే సియం కేసిఆర్ ఇప్పటికే రాష్ట్రంలో ల‌క్షా 35 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డం జ‌రిగింది. ఇంకా ఆయా శాఖ‌ల్లో ఖాళీగా ఉద్యోగాల‌ను గుర్తించి ఇప్పటికే 90 వేల ఉద్యోగాల భ‌ర్తీకి ప్రభుత్వం శ్రీ‌కారం చుట్టింది.రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలే కాదు. ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం  కృషి చేస్తుంది.

కేటిఆర్  కృషితో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డి పెట్టేందుకు విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు ముందుకు వ‌స్తున్నారు. వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తుంది. దేశంలో ఐటి రంగంలో అభివృద్ది చెందిన బెంగుళూరుకు ధీటుగా మ‌న హైద్రాబాద్ ఎదిగింది.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఐటి రంగం, వివిధ కంపెనీల‌ను తీసుకొచ్చేందుకు కేటిఆర్ కృషి చేస్తున్నారు. వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌లాంటి న‌గ‌రాల్లో ఇప్పటికే ఐటి కంపెనీలు వ‌చ్చాయి. వ‌రంగ‌ల్ లోని మెగా టెక్స్ టైల్ పార్క్ లో పెట్టుబ‌డి పెట్టి ఇక్కడి నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి క‌ల్పించేందుకు ప్రఖ్యాత కంపెనీలు ముందుకు వ‌స్తున్నాయి.తెలంగాణ యువ‌త నైపుణ్యాలు పెంచుకోవాలి. నైపుణ్యం ఉన్న యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు చాలా ఉన్నాయి.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నైపుణ్యాభివృద్ది కేంద్రాల‌ను ఏర్పాటు చేసి యువ‌త‌కు నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తుంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగుల కొరకు జాబ్ మేళాలో పాల్గొని ఇక్కడి యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్న ఆయా కంపెనీల‌కు అభినందనలు తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: