ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాను మొదటి స్థాయి ఉంచడమే లక్ష్యం అని
స్థాయి సంఘాల సమావేశం లో జెడ్పి ఛైర్పర్సన్ జక్కుశ్రీహర్షిణిరాకేష్ అన్నారు.
శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ జక్కుశ్రీహర్షిణి రాకేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా 2వ స్థాయి,4వ స్థాయి,7వ స్థాయి,1వ స్థాయి సంఘాల సమావేశం జరగగా 7 స్థాయి లో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సమావేశం జెడ్పి ఛైర్పర్సన్ జక్కుశ్రీహర్షిణిరాకేష్ దాదాపు అన్ని శాఖల అధికారులతో, జడ్పీటీసీ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పట్టు పరిశ్రమ, ఉద్యానవనం, మత్స్య,వ్యవసాయ మరియు పశు సంవర్ధక శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అధికారులు ప్రజా ప్రతినిధులను మమేకం చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ శ్రీ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి,జడ్పీ వైస్ చైర్మన్ కల్లెపు శోభ రఘుపతి రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, జోరుక సదయ్య, గొర్రె సాగర్, సాయిని విజయ ముత్యం, గుడాల అరుణ, కోమల, జిల్లా కో ఆప్షన్ సభ్యులు యాకుబ్, రహీం పాషా, మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Post A Comment: