చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ పురపాలక పరిధిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవ స్థానంలో కార్తీక సోమవారం పూజలను భక్తులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు నేతి దీపాలను పెట్టి మెక్కులు తీర్చుకున్నారు. ప్రసాదం స్వీకరించి ఉపవాస దీక్ష పూర్తి చేశారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను దేవాలయం అధ్యక్షులు, అర్చకులు పర్యవేక్షించారు. చౌటుప్పల్ మండలంలోని వివిధ గ్రామాలలో పలు ఆలయాల్లోనూ కార్తీక సోమవారం సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించారు.

Post A Comment: