ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఉమ్మడి వరంగల్ జిల్లా లోని
పాలకుర్తి లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు సింఎంఆర్ఎఫ్ వరంగా మారిందని, లక్షలాది మందికి కోట్లాది రూపాయల నిధులు అందుతున్నాయని, అనేక మంది ప్రాణాలు కాపాడుతూ, వారికి ఆర్థికంగా సాయంగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివ్రుద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నరు. పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలంలోని 20 మందికి 7లక్షల 18వేల 500 రూపాయల చెక్కులను మంత్రి పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సిఎం సహాయ నిధిని వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: