మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయండి__రాష్ట్ర ఛీప్ సెక్రెటరీ సోమేష్ కుమార్ ను కోరిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
*సింగరేణి ప్రాంతంలోని సింగరేణి స్థలాల్లో గత దశాబ్దకాలంగా నివాసాలు ఏర్పరుచుకున్న సింగరేణి కార్మికుల నివాసాలకు జీవో నెంబర్ 76 అమలు చేయాలనీ,రామగుండంలో సబ్ రిజిస్టర్ కార్యక్రమం ఎర్పాటు చేయాలని రాష్ట్ర ఛీప్ సెకరట్రీ సోమేష్ కుమార్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. హైదరాబాదు సి.ఎస్ కార్యాలయంలో సోమేష్ కుామర్ ను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కలిసారు. జీ.వో.76 అమలు ద్వారా పారిశ్రామిక ప్రాంతంలోని నివాసాలకు యాజమాన్య హక్కు పొందుతారని తరగతిన జీవో నెంబర్ 76 అమలుచేయాలని అమలు చేయాలని కోరారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జీ.వో. 76 కింద దరాఖాస్తులు చేసుకున్న వారికి పట్టాలు మాంజూరు చేయాలన్నారు.
రామగుండంనియోజకవర్గంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉండడంతో సామాన్యులు పెద్దఎత్తున ఖర్చుపెట్టి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లాల్సి వస్తోందన్నారు.
రామగుండంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అవసరమని తద్వారా రామగుండం నియోజకవర్గ ప్రజలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సౌకర్యవంతంగా నిర్వహించి, పెద్దపల్లికి వెళ్లడానికి ఖర్చు సమయాన్నినివారించవచ్చన్నారు.రామగుండం నుండి ప్రతిరోజూ అనేక రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. సిఎస్ సోమేశ్ కుమార్ సానుకులంగా స్పందించారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు.

Post A Comment: