చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ స్మారక భవనంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 105వ జయంతి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు లందగిరి భీమయ్య మాట్లాడుతూ ఇందిరాగాంధీ
ప్రధానిగా దేశానికి ఎన లేని సేవలు చేశారని దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం బ్యాంకును జాతీయకరణ చేసిన సామాన్యులకు కూడా బ్యాంక్ సేవలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ప్రధాని ఇందిరా గాంధీదే గరీబ్ హటావో అనే నినాదంతో దళిత గిరిజనులకు భూములను
పంచిన ఘనత ప్రధాని ఇందిరాగాంధీ అని అన్నారు 20 సూత్రాల పథకాలను తీసుకువచ్చినారని గుర్తు చేశారు ప్రపంచంలోనే అతి శక్తివంతమైన ఉక్కు మహిళగా పేరుపొందారు అన్నారు,

Post A Comment: