ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
బ్రిటిష్ పాలన అనంతరం ఎన్నో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న భారత భూ భాగాన్ని తన చాణిక్యo తో, దృఢమైన నిర్ణయాలతో ఏకం చేసి దేశ రక్షణ కోసం, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు ప్రతి భారతీయునికి ఆదర్శమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె.సురేందర్ రెడ్డి అన్నారు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా “జాతీయ ఐక్యత దినోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహించి పటేల్ చిత్ర పటానికి పూలమాల వేసి, ఘన నివాళి అర్పించి పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించినారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విశాల భారతావని ఏకతాటి పై నడిపించి, భారత ప్రథమ హోం శాఖ మంత్రిగా పనిచేసిన వల్లభాయ్ పటేల్ ఎందరికో ఆదర్శమని వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశ రక్షణ సమగ్రత కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ది పోరాటమే ఊపిరిగా సాగిన ప్రస్థానమని, భారత యూనియన్ లో కలవడానికి ఇష్టపడని హైదరాబాద్ ప్రాంతాన్ని సైనిక చర్య ద్వారా యూనియన్ లో కలిపి ఇక్కడి ప్రజలు మన్ననలు పొందారని, వారి పోరాటం తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆయుధంగా పని చేసిందని అన్నారు. యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబంలో జీవిస్తూ జాతి సమైక్యతకు పునరంకితమై మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళి అవుతుందని అన్నారు. అనంతరం ఐక్యత భావం పెంపొందించేలా ఎస్పీ సురేందర్ రెడ్డి పోలీసు అధికారులు, సిబ్బంది అందరిచే ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు, భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, ఇన్స్పెక్టర్లు రాజిరెడ్డి, జానీ నర్సింహులు, పెద్దన్న కుమార్, అజయ్, జితేందర్ రెడ్డి, సంతోష్, సతీష్, డిపిఓ ఏవో ఆయూబ్ ఖాన్, సూపరింటెండెంట్ సోఫియా సుల్తానా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: