ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజలు పలు సమస్యలతో పోలీస్ అధికారుల వద్దకు వస్తుంటారని, వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వెంటనే చట్టపరిధిలో వారి సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివాస్ కార్యక్రమం లో భాగంగా ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ కలహాలు, భూ తగాదాలు, మరియు ఇతర సమస్యలపై 15 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అలాగే బాధితులతో మాట్లాడిన ఎస్పి గారు వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి, చట్టప్రకారం విచారణ జరిపి తగు చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

Post A Comment: