ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఉమ్మడి వరంగల్ జిల్లా
జనగామ జిల్లా కొడకండ్లలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో జరుగుతున్న శ్రీ మహా చక్ర శరత్ కాల మహోత్సవం - పూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. మంత్రికి పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికి, ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొడకండ్లలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో జరుగుతున్న శ్రీ మహా చక్ర శరత్ కాల మహోత్సవం - పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. అమ్మ వారి దయతో సీఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. సీఎం కెసిఆర్ నాయకత్వములో దేశం రాష్ట్రం లాగే, అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, స్థానిక ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
Post A Comment: