ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ నగర పాలక సంస్థ పరిధి లోని 41 వ డివిజన్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ - ఉన్ - నబీ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ పోశాల పద్మ స్వామి గౌడ్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం
వరంగల్ మండిబజార్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ - ఉన్ - నబీ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పోరేటర్ ఆకుతోట తేజశ్వి శిరీష్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. వరంగల్ కరీమాబాద్ ఉర్సు దర్గా లో మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ - ఉన్ - నబీ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్,కార్పోరేటర్ ఆకుతోట తేజశ్వి శిరీష్,మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: