ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఉమ్మడి వరంగల్ జిల్లా లోని
నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం వద్ద
సరదాగా ఇట్టే జనంతో మమేకం అయ్యే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆదివారం ఓ సరదా సన్నివేశం లో భాగమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. పాలకుర్తి నియోజకవర్గ పర్యటన ముగించుకొని, పలువురిని కలుస్తూ, పరామర్శిస్తూ, వరంగల్ కు వెళ్తున్నారు. దారిలో నెల్లికుదురు మండలం మేచ రాజు పల్లె దాటి ఎర్రబెల్లి గూడెం మీదుగా వెళుతుండగా, దారిలో కొందరు చేపలు పడుతూ కనిపించారు. వెంటనే తన కాన్వాయ్ నుంచి వాహనం దిగి, చేపలు పట్టే వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. వారి లో ఒకరి నుంచి గాలం కర్ర తీసుకున్నారు. ఆ కర్రను పట్టి చేప కోసం వేట మొదలు పెట్టారు. ఈ లోగా వాళ్ళతో సరదాగా మాట్లాడారు. తన పరిచయం, తన సొంత గ్రామం తెలుసా? అంటూ ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణలో నిత్య కృత్యం గా కనిపించిన చేపల వేట, ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు తగ్గిపోయిందని చెప్పారు. తెలంగాణ వచ్చాక, కెసిఆర్ సీఎం అయ్యాక, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాక, చెరువులలో నీరు సమృద్ధిగా చేరాయని చెప్పారు. అలాగే కోట్ల కొలది చేపలను ఉచితంగా చెరువుల్లో వేస్తూ, చేపల విప్లవాన్ని తెచ్చారని చెప్పారు. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా చేపలే కనిపిస్తున్నాయని, తద్వారా చేపలు పట్టే వాళ్ళ కు ఉపాధి, ఆదాయం పెరిగి, వాళ్ళ కుటుంబాలు ఉన్నతంగా బతుకుతున్నారు. ఇది సీఎం కెసిఆర్ సాధించిన గొప్ప విజయమని చెప్పారు. సబ్బండ కులాలకు, ఆయా కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చారని చెప్పారు. మంత్రి గారే నేరుగా తమ వద్దకు వచ్చి కాసేపు సరదాగా వాళ్ళతో కలిసి చేపలు పట్టడంతో వళ్ళంతా సంతోషం వ్యక్తం చేశారు.
Post A Comment: