పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న

           


                       పెద్దపల్లి:అక్టోబర్:09:మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అన్నారు.మహాకవి వాల్మీకి జయంతి పురస్కరించుకొని ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ,అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొన్నారు.మహాకవి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి,జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,మహాకవి వాల్మీకి హైందవ ధర్మానికి అతి ముఖ్యమైన గ్రంథం రామాయణాన్ని 



రచించారని,రామాయణ గ్రంథం ద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని కలెక్టర్  పేర్కొన్నారు.హిందూ ధర్మ శాస్త్రంలో చాలా ప్రాచీనమైన రామాయణ గ్రంథం రచించిన మహాకవి వాల్మీకి అని,ఆయన జీవితం సైతం మనందరికీ ఆదర్శ ప్రాయం అని అన్నారు.రామాయణం ద్వారా ఆదర్శ మానవుడికి ఉండవలసిన లక్షణాలు,మానవ సంబంధాలు,విలువలను మహాకవి మనందరికీ బోధించారని  అన్నారు,మహాకవి వాల్మీకి రచించిన రామాయణం కారణంగానే మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని కలెక్టర్ తెలిపారు.నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వసుదైక కుటుంబం అనే భావన రామాయణంతో ముడీబడి ఉందని కలెక్టర్ తెలిపారు.రామాయణంలోని పితృవ్యాఖ్య పరిపాలన ఒకే భార్య,ఒకే బాణం, ఒకే మాట అనే ఆదర్శాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ యువతకు పిలుపునిచ్చారు.మహాకావ్యం రామాయణాన్ని రచించిన మహాకవి వాల్మీకి జయంతిని పండగగా జరుపుకోవడం సంతోషకరమని కలెక్టర్ తెలిపారు.అనంతరం వక్తలు మహర్షీ వాల్మీకి జీవిత విశేషాలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జె.రంగారెడ్డి,ఇ.డి.ఎస్ సి,కార్పోరేషన్ మధుసుధనశర్మ,జిల్లా ఫిషరీస్ అధికారి భాస్కర్,కలెక్టరేట్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: