ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

జిల్లా షీ టీమ్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం సైబర్ నేరాల పై వెబినార్ సదస్సు కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు హాజరై జిల్లాలోని వివిధ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పి వి. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో రకరకాల నేరాలు జరుతున్నాయని,  ప్రజలు అన్ని మోసాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మోసపోయాక బాధపడేబదులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదని అన్నారు. జిల్లా లోని వివిధ పాఠశాల విద్యార్థులతో వెబినార్ కార్యక్రమం ఏర్పాటు చేసి  అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో భాగంగా

సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి.

బ్యాంక్ ఫ్రాడ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి.ఆన్లైన్లో మోసం జరిగినప్పుడు పోలీస్ వారికి ఏ విధంగా కంప్లెంటు ఇవ్వాలి.

ఎలాంటి వెబ్సైటు లింకులను కూడా ఎప్పుడు ఓపెన్ చేయకూడదు.

మొబైల్ ఫోన్లు వాడే వారు ఎటువంటి ఓ.టి.పి లు ఇతరులకు తెలియజేయరాదని అలా తెలియజేసినట్లయితే తమ వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే అవకాశం ఉంటుందని వివరించారు.

అలాగే చాలా మంది చదువుకున్నవారే సైబర్ నేరాలకు గురవుతున్నారనీ,

'ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయని పేర్కొన్నారు.  సోషల్ మీడియా ఆప్స్  పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు ఎస్పి కోరారు.అలాగే  షీ టీం ప్రత్యేకించి మహిళల కోసమే ఏర్పాటు చేయడం జరిగిందని,  మహిళలు ఎలాంటి ఆపదలో ఉన్న అత్యవసర పరిస్థితుల్లో వెంటనే షి టీిం ఫోన్ నంబర్ 9440904730 కూ గానీ 100 కు గాని ఫోన్ చేయాలని అదనపు ఎస్పీ శ్రీనివాసులు సూచించారు.   మహిళలు, బాలికల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించిన మరే ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా  ఇబ్బందులు కల్గించిన,  తప్పుగా ప్రవర్తిన్చిన కఠినమైనన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు ఎస్పి   హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షీ టీమ్ ఇంఛార్జి ఇన్స్పెక్టర్ అజయ్, ఎస్సై  శ్రీలత, సఖి అడ్మినిస్ట్రేటర్ గాయత్రి, కేస్ వర్కర్ మాధవి, ప్రిన్సిపాల్ ఎంఎస్  మూర్తి  తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: