పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి,అక్టోబర్-28:మాతా,శిశు ఆరోగ్యం పట్ల తీసుకున్న జాగ్రత్తలతో,మెరుగైన సౌర్యాలు,వైద్య సేవలు దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు పెరిగాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అన్నారు.శుక్రవారం డి.ఎం.అండ్ హెచ్.ఓ.డాక్టర్ కె.ప్రమోద్ కుమార్,జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శ్రీధర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణను కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువ డెలివరీలు చేయడం జరిగిందని,ఆగస్ట్ వరకు ప్రతి నెల సరాసరి 113 వరకు ప్రసవాలు చేస్తుండగా,సెప్టెంబర్ లో 180,అక్టోబర్ నెల 28 వరకు 210 చేసినట్లు కలెక్టర్ కు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని అభినందించి మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలనే ఉద్దేశ్యంతో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు,వసతులు కల్పించడం,దానికి తోడు వైద్య సిబ్బంది కృషి, సేవలు అందించడంతో ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకంతో ప్రజలు ఎక్కువగా వస్తున్నారని,ఇదే విధంగా భవిష్యత్తులో నమ్మకమైన,మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు చూరగొనాలని,మాతా,శిశు ఆరోగ్యంపై,పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన పరీక్షలు ఉచితంగా చేసి అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతుందని,ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న మెరుగైన వైద్య సేవలు పొందాలని తెలిపారు.ప్రజల సౌకర్యార్థం కొంత రుసుము చెల్లించి ప్రత్యేక గదులు తీసుకునే సౌకర్యాన్ని నవంబర్ ఒకటి నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్,జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: