పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి,ఎన్టీపీసీ;అక్టోబర్-29:ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన,నవంబర్ 12న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను కేంద్ర ఎరువుల,రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్,పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్,సంగీత సత్యనారాయణ,రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి శనివారం పర్యవేక్షించారు.ముందుగా కలెక్టర్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు,రామగుండంలో ఆర్.ఎఫ్.సి.ఎల్ ప్లాంట్,ఎన్టిపిసి లోని హెలిపాడ్ ప్రాంతాలను పరిశీలించారు.నవంబర్ 12న ఆర్.ఎఫ్.సి.ఎల్ ఎరువుల కర్మాగారాన్ని ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేస్తున్న నేపథ్యంలో ఎరువుల కర్మాగారం,ఎన్టీపిసి టౌన్షిప్ లోని మహాత్మా గాంధీ స్టేడియంలో గల హెలిపాడ్,ప్రధాని సభ ప్రాంగణం,ఎరువుల కర్మాగారంలో ప్రధాని పర్యటన రూట్ మ్యాప్ ను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కుమార్ దీపక్,డిసిపి రూపేష్ కుమార్,ఎన్టిపిసి జిఎం సునీల్ కుమార్,ఎరువుల కర్మాగారం జిఎం జా,మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్,రామగుండం మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు,సర్కిల్ ఇన్స్పెక్టర్ కణతల లక్ష్మీనారాయణ,రామగుండం తహసిల్దార్ జాహద్ పాషా,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు...


Post A Comment: