ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై, శాంతి భద్రతల కు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయoలో ఎస్పీ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తరచూ నేరాలకు పాల్పడితే వారిపై పీడీయాక్టు నమోదు చేయాలని ఆదేశించారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతర నిఘా ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేయాలని అలాగే క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా సమగ్ర నేర విచారణ జరిపి నేరస్తులకు శిక్ష పడే విధంగా ప్రతి ఒక్క పోలీసు అధికారి, బాధ్యతగా పని చేయాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పి కోరారు. సైబర్ నేరాలపై జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. ఉద్యోగాల పేరుతో యువత మోసపోకుండా అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఎస్పి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి వి.శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారం డిఎస్పీలు ఏ. రాములు, డిఎస్పీలు కిషోర్,రామ్మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ లు పెద్దన్న కుమార్, రాజిరెడ్డి, వాసుదేవరావు, జానీ నరసింహులు, అజయ్, జితేందర్ రెడ్డి, పులి వెంకట్, రంజిత్ రావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: