పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:అక్టోబర్:26:రాఘవపూర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నవంబర్ 5 నాటికి రాఘవపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మౌళిక సదుపాయ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సన్నద్ధం చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవార కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద పాఠశాలలో చేపట్టిన పనులను పరిశీలించారు.పెయింటింగ్,ఉపాధి హామీ పనులు,మన ఊరు మనబడి పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసే విధంగా అధికారులు కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.పాఠశాల కాంపౌండ్ వాల్ ఎత్తు దర్గా ఉన్న వైపు మరింత పెంచాలని,దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.పాఠశాలలో త్రాగునీటి సరఫరా పనులు పూర్తి చేయాలని,విద్యార్థుల కోసం నిర్మించే టాయిలెట్స్ లో నిరంతర నీటి సరఫరా జరిగేలా చూడాలని పేర్కొన్నారు.పాఠశాల ఫ్లోరింగ్ పనులు ఆకర్షణీయంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని,ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.పాఠశాల ఆవరణలో ఆకర్షణీయమైన పూల మొక్కలను నాటాలని,పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ పర్యటనలో ఈఈ పంచాయతీరాజ్ మునిరాజు,డి ఈ పెద్దపల్లి శంకరయ్య,ఎంపీడీవో రాజు,ఎఈ మదన్ మోహన్,మండల విద్యాశాఖ అధికారి సంబంధిత అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.


Post A Comment: