పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:అక్టోబర్:29:పెద్దపల్లి జిల్లా,రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖనిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోస్టల్ కవర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు.పద్మశాలి పోరాట యోధుడు,బి.సి నాయకుడు తెలంగాణ తోలి,మలి దశ ఉధ్యమకారుడు తెలంగాణ కోసం తన పదవిని,యావదాస్తిని త్యాగం చేసిన మహనీయుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తించి తెలంగాణా ప్రభుత్వం వారి పేరుమీద అనేక కార్యక్రమాలు చేయటంతో,కేంద్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి పోస్టల్ కవర్ ను విడుదల చేయటం చాలా అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో రామగుండం ఏరియా కార్పొరేషన్ ఏరియా ప్రధాన కార్యదర్శి పద్మశాలి సేవా సంఘం నాయకుడు ఆడెపు శంకర్,మండల సత్యనారాయణ,చిప్ప రాజేశం,పిట్ట లక్ష్మి,నర్సయ్య,అడిచర్ల నంబయ్య,మోర శ్రీనివాస్,వొల్లాల మల్లేశం,మాటేటి శంకర్,వనం శివానందం,కొండి లక్ష్మీ పతి,అందె సదానందం,గుండేటి ప్రభాకర్,అనుముల కళావతి,జానకిరాములు,దాసరి సాంబమూర్తి,బండారి రాజమల్లు,ఆడెపు రవి,రమేష్,కులబాంధవులు తదితరులు పాల్గొన్నారు...

Post A Comment: