చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపల్ స్థానిక టిఆర్ఎస్
కార్యాలయంలో టిఆర్ఎస్ యువజన విభాగం మున్సిపల్ అధ్యక్షుడుతూర్పునూరి
నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసమావేశంలో నర్సింహా గౌడ్ మాట్లాడుతూ చౌటుప్పల్ ఎంపీపీ తాడూరు వెంకట్ వెంకట్ రెడ్డి తన ఆస్తులు అమ్మయినా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని ఓడిస్తా అనడం హాస్యాస్పదమని గతంలో బిజెపి పార్టీని విమర్శించి ఇప్పుడు ఆ పార్టీ గెలుపే లక్ష్యమనిచెప్పడమేంటని విమర్శించారు. మునుగోడులో టిఆర్ఎస్ గెలుపును ఎవరు ఆపలేరనిటిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ప్రజలే ఓట్లు వేస్తారని మునుగోడు నియోజకవర్గం లో టిఆర్ఎస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీఅత్యధిక మెజార్టీతో గెలిచేలా కృషి చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో
కౌన్సిలర్ సుల్తాన్ రాజు, ఉపాధ్యక్షులు మున్నా, సంగిశెట్టి శివ, కానుగు శివ, గంట
నరేందర్, శివా చారి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: