చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
బిజెపి పార్టీ రావాలి బిజెపి పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని, ఇక్కడ ప్రజలు నమ్ము తున్నారని కోమటిరెడ్డి లక్ష్మి
రాజగోపాల్ రెడ్డి అన్నారు.శనివారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ
కార్యాలయంలో స్థానిక 13వవార్డు, 19వ వార్డు, 9వవార్డ్, 11వ వార్డుల నుండి
వివిధ పార్టీలకు చెందిన300 మంది కార్యకర్తలు |కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సతీమణి లక్ష్మీ ఆధ్వర్యంలోబిజెపి పార్టీలో చేరారు వారందరినీ కోమటిరెడ్డి లక్ష్మి
రాజగోపాల్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ,
దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. గత కొన్ని
రోజులుగామునుగోడునియోజకవర్గంలో పర్యటిస్తున్నానని ప్రజల నుండి మంచి స్పందన ఉందని బిజెపిపార్టీకి ఓటేస్తామని రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తామని ఇక్కడ ప్రజలు తెలుపుతున్నారన్నారు. గత మూడున్నర సంవత్సరాల నుండి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, ప్రతిపక్షంలో ఉండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నిసార్లు కొట్లాడిన ఈ ప్రాంతానికి నిధులు మం జూరు చేయలేదని అన్నారు. ఈకుటుంబ పాలన అంతమైతేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, మునుగోడు ప్రజలు చైతన్యవంతులని, ధర్మం వైపు నిలబడతారని రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Post A Comment: