పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
గోదావరిఖని:అక్టోబర్:2:22:న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మహాత్మా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఘనంగా జరిగాయి.ప్రపంచానికి అహింసా సత్యా గ్రహ సిద్ధాంతాలను అందించి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహాత్మా గాంధీ భారతావనికి ఆదర్శప్రాయుడు అని ఈ సందర్భంగా పార్టీ నాయకులు పేర్కొని పట్టణంలోని పాత గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఉన్నత విలువలకు ప్రాధాన్యం ఇచ్చి కేంద్ర మంత్రిగా,ప్రధాన మంత్రిగా దేశానికి సేవలు అందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకను మార్కండేయ కాలనీలో ఘనంగా చేపట్టారు.లాల్ బహుదూర్ శాస్త్రి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు డా.జెవి రాజు,ఉపాధ్యక్షులు వేముల అశోక్,తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి,బి.గోపాల్,ఆషాడం ముకేష్, రామగిరి విక్రం సింగ్,విజయ్ కుమార్,రాజేష్,పటేల్ అధిక సంఖ్యలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: