మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా,మండల కేంద్రంలోని గర్భగౌరీ ఆలయ అభివృద్ధిలో భాగంగా,గ్రామ వాస్తవ్యులు,వేద పండితులు శ్రీ బ్రహ్మశ్రీ మాడుగుల చెంద్రశేఖర శర్మ నేతృత్వంలో,నేటి ఆదివారం రోజున దుర్గాదేవి అమ్మ వారి దసరా శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవముగా జరుగుతున్నాయి.7వ రోజు పూజా కార్యక్రమం,మూల నక్షత్రంలో సరస్వతీదేవి హోమం నిర్వహించడం జరిగిందని,గర్భగౌరీ అలంకరణ లో అమ్మ వారి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని పండితులు చెంద్రశేఖర శర్మ తెలిపారు.సంతానం ఇచ్చే తల్లిని గర్భగౌరీ అని పిలుస్తామని,మహిళలు ఇష్టపడే అమ్మ వారి రూపమే గర్భగౌరీ మాత అని అన్నారు.మన దుర్గతిని తీర్చి,విజయాలు చేకూర్చి, అత్యంత శక్తి నిచ్చే దేవత దుర్గాదేవి మాత అన్నారు.
Post A Comment: